సినిమా వాళ్ళవల్లే ఆడలేదు అంటున్న రాయ్ లక్ష్మీ

సినిమా వాళ్ళవల్లే ఆడలేదు అంటున్న రాయ్ లక్ష్మీ
x
Highlights

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో 'జూలీ 2' సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. తాజాగా ఈ భామ ఒక మీడియా సంస్థకు...

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో 'జూలీ 2' సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. తాజాగా ఈ భామ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా ఫ్లాప్ కు నిర్మాతలే కారణం అంటూ చెప్పుకొచ్చింది. ఆ సినిమాను వారు ఒక బూతు కంటెంట్ ఉన్న సినిమాలా వారు ప్రమోట్ చేయాలనుకున్నారని, అలా చేయడం వల్ల యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకోవచ్చని వారు భావించారని అందుకే ట్రైలర్ మరియు టీజర్ లలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూశారని చెప్పింది రాయ్ లక్ష్మీ.

"కాని సినిమాలో ఆ కంటెంట్ లేకపోవడంతో ఒక వర్గం ప్రేక్షకులు నిరాశ చెందారు. ఫ్యామిలీ ఆడియన్స్ అది అడల్ట్ సినిమా అనుకుని చూడటానికి ఇష్టపడలేదు. 'జూలీ 2'ను ఒక బూతు సినిమా అన్నట్టు కాకుండా రెగ్యులర్ సినిమా లాగా ప్రమోషన్స్ చేసి ఉంటే తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా నచ్చేది." అని చెప్పిన రాయ్ లక్ష్మీ పబ్లిసిటీల పేరుతో నిర్మాతలు సినిమాను చంపేశారు అంటూ వాపోయింది. ఈ సినిమా ఫ్లాప్ తనను బాగా నిరాశ పరిచింది అంటూ రాయ్ లక్ష్మీ పెదవి విరుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories