ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు

ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు
*ఆఫర్ లను తిరస్కరిస్తున్న "పుష్ప: ది రూల్" నిర్మాతలు
Pushpa Producers: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను అందుకొని ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా కూడా బాలీవుడ్ లో మంచి వసూళ్లు నమోదు చేసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది.
అయితే చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారికి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయట. కానీ మైత్రి వారు మాత్రం ఈ సినిమా రైట్స్ ను అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు."పుష్ప: ది రైజ్" సమయంలో బాలీవుడ్ లో తమ సినిమాకి అంత బజ్ లేదు అనుకొని మైత్రి వారు వేరే వారికి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చారు కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా బన్నీకి ఉన్న క్రేజ్ ని బాగా అర్థం చేసుకున్న మైత్రి వారు "పుష్ప: ది రూల్" విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి అనుకుంటున్నారు. అందుకే తమ సినిమాని తామే ఓన్ గా బాలీవుడ్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకోడానికి సిద్ధమవుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Rajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMTమునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMTDiabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 12:30 PM GMTనిను మరువలేం.. తోబుట్టువుపై ప్రేమకు నిలువెత్తు నిదర్శనం
12 Aug 2022 11:45 AM GMTPM Kisan: రైతులకి అలర్ట్.. మరో 20 రోజుల్లో 12వ విడత డబ్బులు..!
12 Aug 2022 11:30 AM GMT