Pushpa Movie: తగ్గేదే లే అంటున్న పుష్ప చిత్రబృందం

* ఒక్క ట్వీట్ తో పుకార్లకు చెక్ పెట్టిన పుష్ప బృందం

admin1
Updated on: 16 Dec 2021 12:01 PM IST
Pushpa Movie Team Tweets Release Date is Confirm on 17th December 2021
X

Pushpa Movie: తగ్గేదే లేదు అంటున్న పుష్ప చిత్రబృందం

Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "పుష్ప: ది రైజ్". ఆర్య, ఆర్య 2 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగనుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలకు సిద్ధం అవుతోంది. గత కొంత కొన్ని రోజులుగా పుష్పకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదని అందుకే సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై చిత్ర బృందం ఒకే ఒక ట్వీట్ తో అందరికీ క్లారిటీ ఇచ్చింది. "పుష్ప డిసెంబర్ 17 తగ్గేదే లే" అంటూ ఒక ఫోటోని షేర్ చేసి సినిమా అనుకున్న తేదీన ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల అవుతుందని చెప్పింది చిత్ర బృందం. మరో వైపు దర్శకుడు సుకుమార్ సినిమా లోని ప్రతి రీల్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ బిజీగా ఉండటంతో ప్రమోషన్ల కి రాలేకపోతున్నారు. డైరెక్టర్ సుకుమార్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ సినిమా విడుదలయ్యాకే ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story