Pushpa Song Update: ఆగష్టు 13న "మేక దాక్కోవాల్సిందే..పులి రావాల్సిందే"

Sandeep Reddy
Updated on: 2 Aug 2021 2:33 PM IST
Pushpa Movie Music Director Devi Sri Prasad Composed First Song With Five Singers in Five Language  And Announced Song Released Date
X

పుష్ప పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Pushpa Song Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం "పుష్ప". ఇప్పటికే పలు కారణాలతో షూటింగ్ ఆలస్యం అవుతున్న ఈ సినిమాకి సంబందించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అల్లు అభిమానులకు ఆసక్తి రేపుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ సినిమా యొక్క మొదటి పాటని ఆగష్టు 13న అయిదు భాషల్లో అయిదుగురు సింగర్స్ తో కంపోజ్ చేసిన సినిమా మొదటి పాట చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇటీవలే "ఆర్ఆర్ఆర్" సినిమాలో కీరవాణి సంగీత సారధ్యంలో "దోస్తీ" పాటను కూడా అయిదు భాషల్లో కంపోజ్ చేసిన ఆ చిత్ర యూనిట్ ఆ పాట యూట్యూబ్ లో కేవలం 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 20 మిలియన్స్ మార్క్ దాటి రికార్డు క్రియేట్ చేసింది.

తాజాగా "పుష్ప" సంగీత దర్శకుడు కూడా అదే పంథాలో వెళ్తుండటంతో సినీ అభిమానులు ఈ పాట "దోస్తీ" పాటను మించి ఉంటుందని పాట లిరిక్స్ విన్న అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. "దాక్కో దాక్కో మేక.. పులోచ్చి కొరుకుద్ది పీక" అనే సాంగ్ లిరిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక హిందీలో "జాగో జాగో బక్రి" అంటూ విశాల్ దాదాలని పాడుతుండగా, తెలుగులో శివమ్, తమిళంలో బెన్నీ డయల్, కన్నడలో విజయ్ ప్రకాష్, మలయాళంలో రాహుల్ నంబియార్ అనే సింగర్స్ ఈ పాటను ఆలపించారు. ఈ సినిమా మొదటి పాటకి సంబంధించిన అప్డేట్ తాజాగా "పుష్ప" సినిమా ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు సినిమా యూనిట్. ఇప్పటికే ఈ సినిమా ఆడియో హక్కులను భారీ మొత్తం చెల్లించి ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story