Pushpa: భారీ కలెక్షన్లు నమోదు చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించిన "పుష్ప"

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్"...

admin1
Updated on: 8 Jan 2022 2:15 PM IST
Pushpa Movie Create Records in Huge Collections | Allu Arjun | Tollywood News
X

Pushpa: భారీ కలెక్షన్లు నమోదు చేసుకున్న సినిమాగా రికార్డు సృష్టించిన "పుష్ప"

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్". చిత్తూరు స్లాంగ్ లో అల్లు అర్జున్ నటన ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. పుష్పరాజ్ పాత్రకి అల్లుఅర్జున్ జీవం పోసారు అనడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ తో సుకుమార్ డైరెక్షన్ కూడా సినిమాకి అంతే క్రేజ్ని తీసుకువచ్చింది.

విడుదలైన మొదటి రోజు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ పుష్ప కలెక్షన్ల విషయంలో మాత్రం "తగ్గేదే లే" అంటూ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది. 2021 లో విడుదలైన తెలుగు సినిమాలలో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న సినిమాలో పుష్ప కూడా ఒకటిగా మారింది. 1300 కోట్ల కలెక్షన్లు అందుకున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ కలెక్షన్లు నమోదు చేసుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.

తెలుగులో మాత్రమే కాక పక్క రాష్ట్రాల్లో కూడా పుష్ప జోరు బాగానే ఉంది. మొదటినుంచి బాలీవుడ్లో మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్న పుష్ప ఇండస్ట్రీలో 700 కోట్ల వరకు గడిచింది మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక కోలీవుడ్ లో రెండవ స్థానాన్ని అందుకుంది పుష్ప.

admin1

admin1

Next Story