Puri With Nagarjuna : పూరితో నాగ్?

Puri With Nagarjuna : ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గత ఏడాది భారీ హిట్ కొట్టిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా

Krishna
Published on: 21 Aug 2020 11:37 AM IST
Puri With Nagarjuna : పూరితో నాగ్?
X

Puri Jagannadh, Nagarjuna (File Photo)

Puri With Nagarjuna : ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గత ఏడాది భారీ హిట్ కొట్టిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. దీనికి చార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.. ప్రస్తుతం కరోనా వలన సినిమా షూటింగ్ వాయిదా పడింది..

అయితే ఈ సినిమా తరవాత పూరి జగన్నాధ్ కింగ్ నాగార్జునతో సినిమాని చేయనున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో పూరి, నాగార్జునని కలిసి స్క్రిప్ట్ వినిపించారని, ఇది కూడా నాగ్ కి బాగా నచ్చడంతో ఒకే చెప్పాడని తెలుస్తోంది. విజయ్ తో మూవీ కంప్లీట్ అయ్యాక నాగ్ తో పూరి సినిమా చేయానున్నాడని టాక్.. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ పైన నిర్మించనున్నారని సమాచారం.. ఇక ఇప్పటికే వీరి కాంబినేషన్ లో శివమణి, సూపర్ సినిమాలు వచ్చాయి.

ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ 4 షూటింగ్ లో ఉన్నారు. అటు సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం వైల్డ్ డాగ్' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాగ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా గరుడవేగ ఫేం ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Krishna

Krishna

Next Story