Dil Raju - Hit Movie: తన రూటే సపరేటు అంటున్న దిల్ రాజు

Dil Raju: దిల్ రాజు తన మూవీ సెలక్షన్స్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నారు. * రాజకుమార్ రావు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు

admin1
Updated on: 9 Oct 2021 11:29 AM IST
Producer Dil Raju Ready to Remake the Vishwak Sen Hit Movie in Bollywood
X

హిట్ మూవీ రీమేక్ చేసేందుకు సిద్ధమైన దిల్ రాజు (ఫోటో-ది హన్స్ ఇండియా )

Dil Raju - Hit Movie: "బాహుబలి" సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం తో చాలామంది నిర్మాతలు కూడా ప్యాన్ ఇండియన్ సినిమాల పై మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం తన రూటే సపరేటు అంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిర్మాతలందరూ స్టార్ డైరెక్టర్ల వెనుక క్యూ కడుతుంటే దిల్ రాజు మాత్రం తన దర్శకులతో షాక్ ఇస్తున్నాడు. ఒకవైపు "భారతీయుడు 2" సినిమా కాంట్రవర్సీ లో శంకర్ పీకల్లోతు ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నప్పుడు దిల్ రాజు శంకర్ మరియు రామ్ చరణ్ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాడు.

మరోవైపు కొందరు నిర్మాతలు బాలీవుడ్ సినిమాలకి దూరంగా ఉంటే దిల్ రాజు మాత్రం తన రెండవ హిందీ సినిమాకి సిద్ధమైపోతున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన "జెర్సీ" సినిమా హిందీ రీమేక్ నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు "హిట్" సినిమా రీమేక్ కూడా నిర్మించడానికి సిద్ధమయ్యారు. రాజకుమార్ రావు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించనున్నారు. మిగతా నిర్మాతలతో పోలిస్తే దిల్ రాజు మాత్రం తన మూవీ సెలక్షన్స్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నారు.

admin1

admin1

Next Story