Priyanka Chopra: పదోతరగతిలో నా బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయా

Sandeep Reddy
Published on: 3 Aug 2021 1:45 PM IST
Priyanka Chopra Shared Her Childhood Memories And About Her Boy Friend in Unfinshed Autobiography Book
X

"అన్ ఫినిష్డ్" బుక్ (ట్విట్టర్ ఫోటో)

Priyanka Chopra: బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన కేరిర్లో బాలీవుడ్ స్టార్ హీరోలకు జోడిగా భారీ బడ్జెట్ సినిమాలలో నటించడమే కాకుండా ఉత్తమ హీరోయిన్ గా పలు ఫిలిం ఫేర్ అవార్డులను పొంది హాలీవుడ్ సినిమాల స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా తాజాగా తన ఆత్మకథను "అన్ ఫినిష్డ్" అనే పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో పలు ఆసక్తికర విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంది. తను అమెరికాలోని తమ బంధువుల ఇంట్లో ఉంది కొన్ని సంవత్సరాలు చదువుకునే సమయంలో తను పదవ తరగతిలో ఉండగా తనకి బాబ్ అనే ఒక స్నేహితుడు ఉండేవాడని తన మాటలతో, సెన్స్ ఆఫ్ హుమార్ తో తనని ఎంతగానో ఆకట్టుకున్నాడని దాంతో అతనితో ప్రేమలో కూడా పడిపోయానని ప్రియాంక చోప్రా తెలిపింది.

ఇక ఒక రోజు తమ ఆంటీ వాళ్ళ ఇంట్లో బాయ్ ఫ్రెండ్ బాబ్ తో కలిసి రొమాన్స్ లో ఉన్నపుడు తన ఆంటీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయానని, ఆ తర్వాత తన ఆంటీతో చివాట్లు పెట్టడమే కాకుండా మా ఇంట్లో కూడా కంప్లైంట్ చేసిందని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తన కంటే 10 ఏళ్ళు పెద్దవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్ళాడి ఆ మధ్య అందరికి షాక్ ఇచ్చింది ప్రియాంక. ఇక ఇటీవల విడుదలైన "అన్ ఫినిష్డ్" బుక్ కూడా మార్కెట్ లో బాగానే ప్రాచుర్యం పొందడంతో పాటు అమెజాన్ లో బెస్ట్ బుక్ సెల్లింగ్ గా నిలిచింది. త్వరలో ప్రియాంక చోప్రా "మ్యాట్రిక్స్ 4" అనే హాలీవుడ్ చిత్రంలో కనిపించబోతుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story