Salaar: "సలార్" సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్న స్టార్ హీరో

Salaar: మలయాళం స్టార్ హీరో తో ప్రభాస్

admin1
Updated on: 19 Oct 2021 9:45 AM IST
Prithviraj Sukumaran Going to be Play a Key Role in Salaar Movie
X

సాలార్ సినిమా లో ముఖ్య పాత్ర పోషించనున్న మలయాళం హీరో (ఫైల్ ఇమేజ్)

Salaar: ఈ మధ్య కాలంలో పర భాష లోని స్టార్ హీరోలంతా టాలీవుడ్ పై కన్నేశారు. ఒకవైపు మలయాళంలో స్టార్ హీరో అయినా ఫాహధ్ ఫాసిల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప" సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక మలయాళం స్టార్ హీరో తెలుగు సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. మలయాళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమా లో ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "సలార్" సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ఒకేసారి తెలుగు మరియు కన్నడ భాషలలో జరగనుంది. హాంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవి బశ్రుర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ "రాధే శ్యామ్", "ఆది పురుష్" మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story