Preity Zinta: 46 ఏళ్ళ వయసులో సరోగసి ద్వారా తల్లి అయిన ప్రీతి జింటా

* సోషల్ మీడియా వేదికగా కవలలు పుట్టారని తన సంతోషాన్ని పంచుకున్న ప్రీతి జింటా

Sandeep Reddy
Published on: 18 Nov 2021 3:42 PM IST
Preity Zinta and Gene Goodenough Welcomes Twin Babies via Surrogacy and Their Names are Gia Zinta and Jai Zinta
X

Preity Zinta: సరోగసి ద్వారా కవలలకు తల్లి అయిన ప్రీతి జింటా

Preity Zinta: 1998లో "దిల్ సే" సినిమాతో హీరోయిన్ గా వెండితెరకి పరిచయమైన బాలీవుడ్ నటి సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా.. వెంకటేష్ హీరోగా నటించిన "ప్రేమంటే ఇదేరా" సినిమాలో తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అటు హీరోయిన్ గానే కాకుండా అటు వ్యాపారంలో తన మార్క్ చూపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ జట్టుకు తొలి మహిళా యజమానిగా గుర్తింపు పొందింది. ఇక అమెరికా వ్యాపారవేత్త అయిన జీన్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా 2016లో ఫిబ్రవరి 29న వివాహం చేసుకొంది. తాజాగా ప్రీతి జింటా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో శుభవార్త పంచుకుంది.

ప్రీతి జింటా సోషల్ మీడియాలో "అందరికి నమస్కారం. ఈ రోజు మా జీవితాల్లో నెలకొన్న సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్‌, నేను కవలలకు జన్మనిచ్చాం. ప్రస్తుతం మా మనసు ప్రేమతో నిండిపోయాయి. సరోగసి ద్వారా కవలలను మా ఫ్యామిలీలోకి స్వాగతించాం. జై జింటా, గియా జింటా అని వారి పేర్లు కూడా నిర్ణయించామని ప్రీతి జింటా పోస్ట్ చేసింది. అంతేకాకుండా సరోగసి ప్రక్రియలో తమకు సహకరించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ప్రీతి జింటా ధన్యవాదాలు తెలిపింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story