రాజశేఖర్ కుటుంబంపై కంప్లైంట్ ఉంది అంటున్న దర్శకుడు

రాజశేఖర్ కుటుంబంపై కంప్లైంట్ ఉంది అంటున్న దర్శకుడు
x
Highlights

సీనియర్ హీరో రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా 'కల్కి' టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ లో మాట్లాడుతూ రాజశేఖర్ తన ముందు సినిమా...

సీనియర్ హీరో రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా 'కల్కి' టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ లో మాట్లాడుతూ రాజశేఖర్ తన ముందు సినిమా 'పీఎస్వీ గరుడవేగ' కు ఎంత కొత్తగా ఫీల్ అయ్యారో 'కల్కి' సినిమాకు పనిచేసే సమయంలో కూడా అలానే ఫీలయ్యానని చెప్పారు. ప్రొడ్యూసర్ సీ. కళ్యాణ్ గారు కథలో విషయం లేకపోతే సినిమా ఒప్పుకోరని, అయనకు కథ నచ్చడమే సినిమా విజయానికి మొదటి మెట్టు అని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ 'అ!' కంటే ముందే ఈ స్క్రిప్ట్ తో జీవితగారిని కలిశానని, అప్పుడే సినిమా చేయాల్సింది కానీ కుదరలేదని అన్నారు.

రాజశేఖర్ గారితో పనిచేయడం ఒక వండర్ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అని, అయన ఎప్పుడూ జోకు లతో నవ్విస్తారని చెప్పారు. రాజశేఖర్ ఫ్యామిలీ పై ఒక కంప్లైంట్ కుడా ఉందని, వాళ్లు ప్రేమతో భోజనం ఎక్కువ పెడతారని అన్నారు. అలానే రాజశేఖర్ కి యాంగ్రీ స్టార్ అనే బిరుదుని ఇస్తున్నానని పేర్కొన్నారు. 'కల్కి' కమర్షియల్ సినిమా కానీ కొత్త ఫార్మాట్ లో ఉంటుందని హింట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా చేయాలనుందని, కుదిరితే వచ్చే ఏడాది రాజశేఖర్ పుట్టిన రోజుకి ఈ సినిమా సీక్వెల్ ను మొదలుపెడతామని తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories