MAA Elections: నటుడు ప్రకాష్ రాజ్ వీరాభిమాని సాహసం

MAA Elections: మా ఎన్నికల్లో విజయం కోరుతూ సుదీర్ఘ యాత్ర * రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్న రంజీత్‌కుమార్

Sandeep Eggoju
Published on: 18 Aug 2021 5:50 PM IST
Prakash Raj Fan Padayatra From Rajahmundry to Hyderabad
X

ప్రకాష్ రాజ్ (ఫైల్ ఇమేజ్)

MAA Elections: "మా"ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని జూనియర్ ఆర్టిస్ట్ రంజీత్ కుమార్ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు. రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో పెందుర్తి ఫౌండేషన్ అధినేత పెందుర్తి సునీల్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ప్రకాష్ రాజ్‌కు అందరు మద్దత్తు తెలపాలని కోరుతూ ఈ పాదయాత్ర చేస్తున్నట్లు రంజీత్‌ కుమార్ తెలిపారు. ఆర్టిస్ట్‌లకు లోకల్ నాన్ లోకల్ అంటూ ప్రాంతీయ భేదాలు ఉండకూడదని తెలిపారు. పాదయాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకోగానే ప్రకాష్‌రాజ్‌ను కలుస్తానని రంజీత్‌ కుమార్ అన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story