ప్రభాస్ తో పోటీపడనున్న మరొక స్టార్ హీరో

ప్రభాస్ తో పోటీపడనున్న మరొక స్టార్ హీరో
x
Highlights

'బహుబలి' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈసారి 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే....

'బహుబలి' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈసారి 'సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తారీఖున మూడు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మరొక స్టార్ హీరో సినిమా పోటీ ఇవ్వనుందట. అది తమిళ స్టార్ హీరో సూర్య సినిమా కావడం విశేషం.

సూర్య హీరోగా మోహన్ లాల్, ఆర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న సినిమా 'కప్పాన్'. కోలీవుడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సూర్య అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కూడా ఆగస్ట్ 15 వ తారీఖున విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే 'సాహో' సినిమాకి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వనుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ ఆగస్ట్ లో సినిమా ప్రేమికుల హంగామా మాములుగా అయితే ఉండదు.

Show Full Article
Print Article
Next Story
More Stories