Crazy Combo: ప్రభాస్-సుక్కు మూవీ స్టోరీ లీక్.. సబ్జెక్ట్ ఏంటంటే..?

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్...మన పాన్ ఇండియా హీరో మరో పాన్ ఇండియా డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడు.

Arun Chilukuri
Updated on: 27 April 2023 9:31 PM IST
Prabhas Sukumar New Movie Story Leaked
X

Crazy Combo: ప్రభాస్-సుక్కు మూవీ స్టోరీ లీక్.. సబ్జెక్ట్ ఏంటంటే..?

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్...మన పాన్ ఇండియా హీరో మరో పాన్ ఇండియా డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడు. ఔను, పుష్ప మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన లెక్కల మాస్టార్ సుకుమార్ తో ప్రభాస్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎందుకో సాధ్యపడలేదు. అయితే ఇన్నాళ్లకు వీళ్లిద్దరు ఒక పిరియాడిక్ మూవీ కోసం చేతులు కలిపారు.

దర్శకుడు సుకుమార్ ఈమధ్య ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకనిర్మాతలతో సమావేశం అయిన విషయం మనకు తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే నిర్మాత అభిషేక్ అగర్వాల్..సుకుమార్ కాంబోలో ఒక సినిమా ఉంటుందని చెప్పాడు కూడా. సుకుమార్ ఎవరితో సినిమా తీస్తాడని అప్పట్లో మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారగా...ప్రభాస్ కోసమే నాడు బాలీవుడ్ దర్శకనిర్మాతలతో సుకుమార్ సమావేశం అయ్యారని ఇప్పుడు రివీల్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేసే చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుండగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆదిపురుష్ రిలీజ్ కి సిద్ధం అవుతుండగా, సలార్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ప్రాజెక్ట్ K, రాజా డీలక్స్ సైతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటి తర్వాత స్పిరిట్ మూవీ ఉంది. ఇక సుకుమార్ పుష్ప2 చిత్రీకరణలో ఉన్నాడు. పుష్ప2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ మూవీని సుకుమార్ పట్టాలెక్కించనున్నాడు. స్పిరిట్ మూవీతో పాటు సుకుమార్ చిత్రంలో ప్రభాస్ సమాంతరంగా నటించనున్నాడు. ఇకపోతే, రజాకార్ ఉద్యమ నేపథ్యంగా ప్రభాస్-సుక్కు సినిమా ఉంటుందని టాక్ జోరుగా వినిపిస్తుంది. దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సాయుధ యోథుడిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story