Prabhas Sister Praseedha Grand Entry: సినిమాల్లోకి ప్రభాస్ సోదరి ఎంట్రీ!

Prabhas Sister Praseedha Grand Entry: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు. కొందరు హీరోలుగా, మరికొందరు దర్శకనిర్మాతలుగా కొనసాగుతున్నారు.

Krishna
Published on: 11 July 2020 1:03 PM IST
Prabhas Sister Praseedha Grand Entry: సినిమాల్లోకి ప్రభాస్ సోదరి ఎంట్రీ!
X
Prabhas Sister Praseedha Grand Entry With Radhe Shyam

Prabhas Sister Praseedha Grand Entry: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు. కొందరు హీరోలుగా, మరికొందరు దర్శకనిర్మాతలుగా కొనసాగుతున్నారు.. అందులో భాగంగానే రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి మరొకరు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.. వారు ఎవరో కాదు.. కృష్ణంరాజు పెద్ద కుమార్తె ప్రసీద.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్‌ నిర్మాణంలో ఆమె పాలుపంచుకుంటూ..ఈ సినిమాకు నిర్మాతగా అడుగుపెట్టనున్నారు. రాధేశ్యామ్ సినిమా నిర్మాతల్లో వంశీ, ప్రమోద్ తో పాటు ప్రసీద కూడా ఉన్నారు. సినిమాలతో పాటుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారట.. ఇందులో ఆమె అన్నయ్య, హీరో ప్రభాస్ పూర్తి సహకారం అందిస్తున్నారట..

ఇక ఇప్పటికే కృష్ణంరాజు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్ ఇక బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ మూవీ ఫేమ్ కె.రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది.UV బ్యానర్‌తో కలిసి గోపికృష్ణ బ్యానర్‌పై కృష్ణం రాజు నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Krishna

Krishna

Next Story