Radhe Shyam Movie: ఇంటర్వ్యూ లు క్యాన్సిల్ చేస్తున్న ప్రభాస్

Radhe Shyam Movie: సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్న "రాధేశ్యామ్" ?

admin1
Published on: 3 Jan 2022 6:10 PM IST
Prabhas Radhe Shyam Movie is Almost Postponed | Tollywood News Today
X

 ఇంటర్వ్యూ లు క్యాన్సిల్ చేస్తున్న ప్రభాస్

Radhe Shyam Movie: ఎప్పుడూ వరుస సినిమా విడుదలలతో సంక్రాంతి సీజన్ చాలా హడావిడిగా ఉంటుంది. కానీ ఈ సారి టాలీవుడ్లో అటువంటి హడావిడి ఉండేటట్టు కనిపించడం లేదు. నిన్నమొన్నటిదాకా సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతాయని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. "ఆర్ ఆర్ ఆర్" జనవరి 7న జనవరిన, "రాధే శ్యామ్" జనవరి 14న విడుదల అవుతాయని అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలో పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో పెట్టుకొని విడుదలను వాయిదా వేసింది "ఆర్ఆర్ఆర్" బృందం. దీంతో "రాధే శ్యామ్" కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

"రాధేశ్యామ్" వంటి భారీ బడ్జెట్ సినిమాకి తెలుగులో మాత్రమే కాక వేరే భాషల్లో కూడా కలెక్షన్లు అంతే కీలకం అవుతాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఈ సినిమాకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ నార్త్ వైపు చాలావరకూ థియేటర్లు మళ్లీ మూసివేస్తున్నారు. ఈ సమయంలో సినిమాలు విడుదల చేస్తే డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోతారు. ఈ నేపథ్యంలో టీ సిరీస్ వారు ఈ సినిమాని విడుదల చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. ప్రభాస్ కూడా త్వరలో పాల్గొనాల్సిన ప్రమోషన్ ఇంటర్వ్యూలను క్యాన్సిల్ చేస్తున్నారు. దీంతో "రాధే శ్యామ్" సినిమా దాదాపు వాయిదా పడినట్లు చెప్పవచ్చు.

admin1

admin1

Next Story