ప్రభాస్ కొత్త చిత్రం ఈ సంవత్సరమే విడుదల!

ప్రభాస్ కొత్త చిత్రం ఈ సంవత్సరమే విడుదల!
x
Highlights

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు...

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత ఫారిన్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు నిర్మాతలు. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతోందని చెబుతున్న ఈసినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకుడు.

ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి అనుకున్న సమయం కంటే ఆలస్యం అయింది. ఇక షూటింగ్ కూడా చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో సినిమా విడుదల తేదీ విషయంలో టాలీవుడ్ లో రకరకాల వార్తలు వినవచ్చాయి. కొందరు ఈ డిసెంబర్ లేదా వచ్చే జనవరిలో విడుదలవుతుందని చెప్పుకురాగా.. మరికొంత మంది వచ్చే వేసవి వరకూ సినిమా విడుదలయ్యే చాన్స్ లేదని అంటూ వచ్చారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ సినిమా విడుదల తేదీని సినిమా యూనిట్ ఖారారు చేసిందని సినీవర్గాలు తాజాగా ప్రచారం చేస్తున్నాయి. అధికారికంగా ఈ తేదీ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ, ఈ సంవత్సరమే ఈ సినిమా విడుదల ఉంటుందనీ.. అదీ ఈ దసరాకే విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనీ విశ్వసనీయంగా తెలుస్తోంది.

అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు విపరీతంగా ప్రచారం అచుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా జరపాలని చిత్ర బృందం కృత నిశ్చయంతో ఉందని తెలుస్తోంది. వారనుకుంటున్నట్టు ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా వేగంగా సాగితే దసరా బరిలో ప్రభాస్ సినిమా విడుదల ఉంటుందని అనుకోవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories