ప్రభాస్ ను అవమానించిన నెట్ ఫ్లిక్స్.. నిప్పులు చెరుగుతున్న ఫ్యాన్స్..

Prabhas Fans Trend Unsubscribe Netflix
x

ప్రభాస్ ను అవమానించిన నెట్ ఫ్లిక్స్.. నిప్పులు చెరుగుతున్న ఫ్యాన్స్..

Highlights

Prabhas: బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.

Prabhas: బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సాహో వంటి యాక్షన్ సినిమాలో కనిపించాడు కానీ ఆ సినిమా ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకోలేకపోయింది. ఇక ఈ మధ్యనే విడుదలైన "రాధే శ్యామ్" కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. విభిన్న కాన్సెప్ట్లతో అదిరిపోయే సినిమాలతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు ప్రభాస్.

త్వరలోనే ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న "ఆది పురుష్" సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదల కాబోతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో "సలార్" సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు ప్రభాస్. సందీప్ వంగా దర్శకత్వంలో "స్పిరిట్" మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్టు కే" సినిమాలను కూడా లైన్ లో పెట్టిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

అయితే అలాంటి ప్రభాస్ గురించి నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా వారు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సాహో లో ఒక యాక్షన్స్ సన్నివేశం క్లిప్పు పోస్ట్ చేస్తూ "ఇది ఎలాంటి యాక్షన్" అని అర్థం వచ్చేలాగా ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు నెట్‌ఫ్లిక్స్ పై విరుచుకుపడ్డారు. లెట్స్ అన్ సబ్‌స్క్రైబ్‌ ని ట్రెండ్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ను వెంటనే వెనక్కి తీసుకుంటున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories