ప్రభాస్ బాహుబలి సినిమాకు సైన్ చేయడానికి వెనుక షాకింగ్ నిజం

ప్రభాస్ బాహుబలి సినిమాకు సైన్ చేయడానికి వెనుక షాకింగ్ నిజం
x
Highlights

కేవలం ఒకే ఒక్క సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల కే పరిమితమైన ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో...

కేవలం ఒకే ఒక్క సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల కే పరిమితమైన ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. నిజానికి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' సినిమా కోసం రోజుల లెక్కన కాకుండా ఏకంగా ఏళ్ల లెక్కన కాల్షీట్లు ఇచ్చాడు. 'బాహుబలి' 2 భాగాలు పూర్తయ్యే పూర్తవడానికి నాలుగున్నర ఏళ్లు పట్టింది అన్న సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్యలో ప్రభాస్ వేరే సినిమాల వైపు చూడకుండా కేవలం 'బాహుబలి' పైనే దృష్టి పెట్టాడు.

అసలు ప్రభాస్ 'బాహుబలి' సినిమా ఒప్పుకోవడానికి కారణం రాజమౌళి ఇచ్చిన భారీ రెమ్యూనరేషన్ అని కొందరు అంటుంటే ఈ మధ్యనే ప్రభాస్ దాని వెనుక ఉన్న షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. నిజానికి ఎప్పటినుండో ప్రభాస్ తండ్రి గారైన కీర్తిశేషులు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కు ప్రభాస్ ను ఒక మహారాజులా వెండితెరపైన చూడాలని అనుకునేవారట. అందుకనే 'బాహుబలి' సినిమా కథ విన్నవెంటనే ప్రభాస్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే 'బాహుబలి' సినిమా విడుదలయ్యే సరికి ప్రభాస్ తండ్రి కన్నుమూశారు. ఆయన సినిమా చూడకపోయినప్పటికీ ఆయన కల నెరవేర్చేందుకు ప్రభాస్ 'బాహుబలి' సినిమా ఒప్పుకున్నాడట.

Show Full Article
Print Article
Next Story
More Stories