ప్రభాస్-అనుష్క ఇన్ స్టా చాట్ లీక్.. బయటకు పొక్కిన ఆ రహస్యం..!

Prabhas - Anushka Shetty: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సిల్వర్ స్క్రీన్ స్వీటీ మధ్య ప్రేమ ఉందని నెటిజన్స్ కు ఎప్పటి నుంచో ఒక డౌటు వెంటాడుతోంది.

Arun Chilukuri
Updated on: 3 May 2023 6:00 PM IST
Prabhas Anushka Instagram Chat Leaked
X

ప్రభాస్-అనుష్క ఇన్ స్టా చాట్ లీక్.. బయటకు పొక్కిన ఆ రహస్యం..!

Prabhas - Anushka Shetty: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సిల్వర్ స్క్రీన్ స్వీటీ మధ్య ప్రేమ ఉందని నెటిజన్స్ కు ఎప్పటి నుంచో ఒక డౌటు వెంటాడుతోంది. ప్రభాస్-అనుష్క ఇరువురు పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఇద్దరి ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారు కూడా. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని అంతకుమించి తమ మధ్య మరేమీ లేదని అనుష్క, ప్రభాస్ ఇద్దరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్, కృతిసనన్ మధ్య ఏదో జరుగుతోందని ఈ మధ్య గుసగుసలు వినిపించాయి. కానీ, ఈ విషయాన్ని ఇద్దరు ఖండించారు.

ప్రభాస్-కృతిసనన్ ఎపిసోడ్ ను డార్లింగ్ ఫ్యాన్స్ మర్చిపోతున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్, అనుష్క మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. వీరిద్దరి మధ్య జరిగిన ఇన్ స్టా చాట్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో వీరి గురించి మళ్లీ చర్చ మొదలైంది.

అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుండగా ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీలో ఈ సినిమా పోస్టర్ ను షేర్ చేశాడు. దీనికి రెస్పాండ్ అవుతూ అనుష్క థ్యాంక్స్ పప్స్ అని కామెంట్ చేసింది. ఈ కామెంట్ చూసిన నెటిజన్స్ ప్రభాస్ ను అనుష్క ముద్దుగా పప్స్ అని పిలుచుకుంటుందని అందుకనే అలా పోస్ట్ పెట్టిందని సదరు పోస్ట్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

ప్రభాస్_అనుష్క ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ఇద్దరు కలిసి నటించలేదు. వీరు మళ్లీ కలిసి నటిస్తే చూడాలని అటు డార్లింగ్ ఫ్యాన్స్ ఇటు స్వీటీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story