logo
సినిమా

జపాన్ లో ప్రభాస్, అనుష్క...మళ్లీ పుకార్లు స్టార్ట్..

జపాన్ లో ప్రభాస్, అనుష్క...మళ్లీ పుకార్లు స్టార్ట్..
X
Highlights

నాలుగు సినిమాల్లో కలిసి నటించడం వల్ల ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారు అంటూ పుకార్లు చాలానే విన్నాం....

నాలుగు సినిమాల్లో కలిసి నటించడం వల్ల ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారు అంటూ పుకార్లు చాలానే విన్నాం. కొన్నాళ్ల నుంచి ఈ వార్తలు వినిపించడం లేదు అనుకుంటున్న సమయంలో మళ్లీ వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని కొందరు చెబుతున్నారు. 'బాహుబలి' పుణ్యమాని ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ సినిమాలకు జపాన్ కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ హిట్ సినిమాలైన 'మిర్చి' మరియు 'డార్లింగ్' సినిమాలను జపాన్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క కలిసి నటించడంతో వారిద్దరూ ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మార్చి రెండవ తారీకున ఈ సినిమా స్క్రీనింగ్ జరగబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ లేదా కలిసి తిరుగుతూ కనిపిస్తుండడంతో ఆ వార్తలకు ఆజ్యం పోసినట్లు అవుతుంది. మళ్ళీ వీరు ప్రేమపక్షులలా తిరుగుతున్నారని కొందరు కోడైకూస్తున్నారు. మరో వైపు వీరిద్దరూ మాత్రం సినిమాలపైన తప్ప పెళ్లి పైన దృష్టి పెట్టడంలేదు. చూస్తూ ఉంటే ఈ పుకార్లకు అంతంలేదేమో.

Next Story