ప్రభాస్ ఆది పురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా...

ప్రభాస్ ఆది పురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా...
x

ప్రభాస్ ఆది పురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా 

Highlights

  • Adi Purush Budget: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్".

Adi Purush Budget: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ డ్రామా కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతుండగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఇక రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటిస్తున్నారు. "ఆది పురుష్" సినిమా 2022 ఆగస్ట్ 11 విడుదలకి సిద్ధమవుతున్నట్లుగా చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాకి నిర్మాతలు మొత్తంగా పెట్టిన బడ్జెట్ ఫిగర్ తెలిసింది. ఈ సినిమాకి గాను నిర్మాతలు ఏకంగా 400 కోట్లు ఖర్చు పెట్టారనీ సమాచారం. ఇంతకు ముందు ఈ సినిమా బడ్జెట్ ఇంకా ఎక్కువే అని వినిపించింది కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం మాత్రం 400 కోట్లు మాత్రమే ఖర్చు అయిందట. అయితే ఈ తేదీ నుండి సినిమా వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే ప్రభాస్ నటించిన "రాధేశ్యామ్" వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సింది కానీ అది కూడా వాయిదా పడింది. ఇక "సలార్" సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories