Prabhas21 To Have a Second Heroine : ప్రభాస్ 21 లో మరో హీరోయిన్?

Prabhas21 To Have a Second Heroine : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి

Krishna
Published on: 1 Aug 2020 2:50 PM IST
Prabhas21 To Have a Second Heroine :  ప్రభాస్ 21 లో మరో హీరోయిన్?
X
Deepika Padukone and Prabhas

Prabhas21 To Have a Second Heroine : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ప్రభాస్ కి 21 వ సినిమా కావడం విషయం. ఈ సినిమాని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగానే ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే చిత్రబృందం ఇప్పటికే బాలీవుడ్ భామ దీపికా పదుకొనేను హీరోయిన్ ని ఎంపిక చేసింది. వెండితెర పైన దీపికా పదుకొనే, ప్రభాస్ జంట అద్భుతంగా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక చిత్ర యూనిట్ దీపికా పదుకొనేను కాకుండా ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా సినిమాలోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ ఓ యంగ్ హీరోయిన్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.. కానీ దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ఇక గత ఏడాది సాహో సినిమాతో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' మూవీ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంది.‎1930 కాలంలో ప్రేమకథ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తుంది. ఈ సినిమా పూర్తికాగానే నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ నటిస్తాడు.

Krishna

Krishna

Next Story