ప్రభాస్ కి జోడిగా ఆలియాభట్?

ప్రభాస్ కి జోడిగా ఆలియాభట్?
x
Actor Prabhas, Aliya bhat(File photo)
Highlights

పాన్ ఇండియన్ మూవీలు తెరకెక్కిస్తున్నప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దర్శకులు.

పాన్ ఇండియన్ మూవీలు తెరకెక్కిస్తున్నప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దర్శకులు.అయితే హీరోయిన్ ఎంపిక లో మాత్రం బాగానే కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఇందులో హీరోయిన్ ఎంపిక కోసం నాగ్ అశ్విన్ చాలా మందిని అనుకుంటున్నాడట.. అందులో భాగంగా ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా చేరిపోయింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఆమెను ఇప్పటికే సంప్రదించగా, ఆమె కూడా ఈ ప్రాజక్టు చేయడానికి ఆమె సుముఖంగా వున్నట్టు సమాచారం. లాక్ డౌన్ ముగియగానే దర్శకుడు నాగ్ అశ్విన్ ముంబై వెళ్లి అలియాకు కథ చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అలియా భట్ బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం అనంతరం ఆమె ప్రభాస్ సినిమా చేయనున్నట్లు సమాచారం.. వైజయంతి మూవీస్ పై ఈ సినిమాని సీ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తుంది. పూర్వ జన్మల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఓ మై డియర్, రాధేకృష్ణ అనే టైటిల్స్ ని పరిశీలనంలో ఉంచారు. నవంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గానే ఈ సినిమా తెరకెక్కుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories