Guntur Kaaram: మహేష్ బాబు 'గుంటూరు కారం'లో పవర్ స్టార్.. క్రేజీ న్యూస్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..!

Guntur Kaaram: గుంటూరు కారం క్రేజీ న్యూస్.. మహేష్ బాబు ఎంట్రీ సీన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Shekhar G
Published on: 18 Nov 2023 3:26 PM IST
Power Star Pawan Kalyan May Voice Over For Mahesh Babu Guntur Kaaram Movie
X

Guntur Kaaram: మహేష్ బాబు 'గుంటూరు కారం'లో పవర్ స్టార్.. క్రేజీ న్యూస్‌తో ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్..!

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాతో అభిమానుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమా.. వీరి కాంబినేషన్‌లో మూడోది కావడం గమనార్హం. మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమా.. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో రానుంది. కాగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో శ్రీలీల సూపర్ స్టార్‌తో రొమాన్స్ చేయనుంది. అలాగే మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. విలన్‌గా జగపతి బాబు కనిపించనున్నాడు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. జనవరి 12, 2024న 'గుంటూరు కారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమాపై ఎన్నో న్యూస్ బయటికి వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారనే వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఇటు ప్రిన్స్ ఫ్యాన్స్‌కు, అటు మెగా అభిమానులకు పండుగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే, మరో వార్త కూడా వినిపిస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ వాయిస్ మాత్రమే వినిపిస్తుందని తెలుస్తోంది. సినిమా ప్రారంభంలో సూపర్ స్టార్ సీన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాల్లోపవర్ స్టార్ వాయిస్ వినిపిస్తుందని అంటున్నారు. మరి ఈ న్యూస్‌లో నిజం ఏంటో తెలియాల్సి ఉంది. కాగా, ఈ సినిమా నుంచి ఇటీవలే వచ్చిన 'ధమ్ మసాలా' పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story