HBD Megastar Chiranjeevi : అన్నయ్య చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్!

HBD Megastar Chiranjeevi : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన 65 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా

Krishna
Published on: 22 Aug 2020 1:45 PM IST
HBD Megastar Chiranjeevi : అన్నయ్య చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్!
X

 chiranjeevi,pawan kalyan

HBD Megastar Chiranjeevi : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు తన 65 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా అభిమానులు, సినీ,రాజకీయ ప్రముఖులు ఆయనకి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే హీరో, జనసేన అధినేత, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు అయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

"సామావ్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఆవిర్భావం అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో నా అన్నయ్య చిరంజీవి గారిని కూడా అంతలా పూజ్య భావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చేయిపట్టి పెరిగాను. ఒక విధంగా చెప్పాలంటే అన్నయ్యే నా తొలి గురువు. అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిగా నిలిచారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణమైన స్థానాన్ని సంపాదించారు. తెలుగువారు సగర్వంగా "చిరంజీవి మావాడు" అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారు.

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగి, నాలాంటివారు ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. కష్టాన్ని నమ్ముకున్నారు. సముచిత స్థానానికి చేరుకున్నారు. చిన్న పాయగా ఉద్భవించే నది అఖండ రూపాన్ని సంతరించుకున్నట్లు శ్రీ చిరంజీవి గారు ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అలవరుచుకున్నారు. ఆయన ఎదుగుదల ఆయనలోని సేవా తత్పరతను ఆవిష్కరింపచేసింది. ఆయనలా నటుడవుదామని, ఆయనలా అభినయించాలని కొందరు స్పూర్తి పొందితే. ఆయనలా సేవ చేయాలని మరెందరో ప్రేరణ పొందారు. తన అభిమానులకు 'సేవ' అనే సత్కార్యానికి దారి చూపారు.

ఎందరో ఆ దారిలో పయనిస్తూ నేడు సమాజంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆపన్నులకు అండగా వుంటున్నారు. అటువంటి కృషీవలునికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. నేడు శ్రీ చిరంజీవి గారి జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను తెలుగు వారందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. శ్రీ చిరంజీవి గారికి చిరాయువుతో కూడిన సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.





Krishna

Krishna

Next Story