Posani Krishna Murali: సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్

* గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

Sandeep Reddy
Published on: 30 July 2021 6:43 AM IST
Posani Krishna Murali And Family Tested Corona Positive And Joined in Gachibowli AIG Hospital
X

పోసాని కృష్ణమురళి (ఫైల్ ఫోటో)

Posani Krishna Murali: ప్రముఖ సినీనటుడు పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ కన్‌ఫామ్‌ అయ్యింది. తనతోపాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకినట్లు పోసాని వెల్లడించారు. ప్రస్తుతం గచ్చిబౌళిలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. తనకు సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు, హీరోలను మన్నించమని కోరారు. తన వల్ల సినిమా షూటింగ్స్ ఆగిపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఆశీస్సులతో పాటు త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతానని పోసాని తెలియజేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story