Tollywood : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం..పరిస్థితి విషమం

Dhivi
Published on: 4 March 2025 9:40 PM IST
Tollywood : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం..పరిస్థితి విషమం
X

Tollywood : ప్రముఖ సింగర్ కల్పన ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. రెండు రోజులు ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు, అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి డోర్ బద్దలు కొట్టారు. అప్పటికే ఆమె ఆపస్మారక స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిల్లేజ్ లో ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి కల్పన నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత కారణాలతో నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను స్థానిక ప్రైవేట్ హోలిస్టిక్ ఆసుపత్రికి తరలించారు.

Dhivi

Dhivi

Next Story