బుల్లితెర పై యావరేజ్ గా మిగిలిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా

బుల్లితెర పై యావరేజ్ గా మిగిలిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ సినిమా
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అరవింద సమేత వీర రాఘవ'. రాయలసీమ ఫాక్షన్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది దసరా కి విడుదలైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అరవింద సమేత వీర రాఘవ'. రాయలసీమ ఫాక్షన్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది దసరా కి విడుదలైంది. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఫ్యాక్షనిస్టుగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మరియు త్రివిక్రమ్ రాసిన డైలాగులు ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా బుల్లి తెరపై మాత్రం ఘన విజయం సాధించలేకపోయింది.

ఈ మధ్యనే జీ తెలుగు చానల్ లో ప్రసారం చేయగా కేవలం 13.70 టీఆర్పీ మాత్రమే పొందింది 'అరవింద సమేత'. ఇప్పటిదాకా 20.17 రేటింగ్ తో విజయ్ దేవరకొండ 'గీతగోవిందం' సినిమా మొదటి స్థానంలో ఉంది. ఇక 19.5 రేటింగ్ తో 'రంగస్థలం' కూడా రెండవ స్థానంలో ఉంది. ఇక వాటితో పోల్చుకుంటే ఎన్టీఆర్ సినిమాకు యావరేజ్ టిఆర్పి మాత్రమే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక 'హలో గురు ప్రేమకోసమే' 8.7, 'తొలి ప్రేమ' 6.2, 'పందెంకోడి 2' 5.5, 'అమర్ అక్బర్ ఆంటోనీ' 3.2 తో సరిపెట్టుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories