పూనమ్‌ పాండే ని చిత్ర హింసల పాల్చేసిన భర్త.. గృహహింస చట్టం కింద శాం బాంబే అరెస్ట్

Poonam Pandey: బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే భర్త సామ్‌ బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Arun Chilukuri
Updated on: 9 Nov 2021 9:01 PM IST
Poonam Pandeys Husband Sam Bombay Arrested
X

పూనమ్‌ పాండే ని చిత్ర హింసల పాల్చేసిన భర్త.. గృహహింస చట్టం కింద శాం బాంబే అరెస్ట్

Poonam Pandey: బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే భర్త సామ్‌ బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనను తీవ్రంగా కొట్టడంతోపాటు వేధింపులకు గురిచేశాడని పూనమ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. భర్త దాడిలో తల, కండ్లు, ముఖంపై గాయాలైన పూనంను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా రెండేళ్లు సహజీవనం అనంతరం గతేడాది సెప్టెంబర్‌1న పూనమ్‌-శామ్‌ బాంబే వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అయితే పెళ్లయిన కొద్ది రోజులకే శామ్‌ బాంబే.. పూనమ్‌పై చేయి చేసుకోవడంతో పాటు విచక్షణరహితంగా దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది. అనంతరం భర్త క్షమాపణలు చెప్పి రాజీకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా మరోసారి సామ్‌ బాంబే చేసిన దాడిలో పూనమ్‌ తీవ్ర గాయాలపాలైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story