పవన్ కు పెరుగుతున్న గ్రాఫ్.. మళ్లీ ఎంట్రీ ఇచ్చిన పూనమ్.. ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై సన్సేషనల్ ట్వీట్..

Poonam Kaur: పూనమ్ కౌర్..పరిచయం అక్కర్లేని పేరు ఇది. నటిగా అంతగా పాపులర్ కాలేదు కానీ...పవన్ కల్యాణ్ ఇష్యూస్ తో పూనమ్ చాలా పాపులారిటీ సంపాదించింది.

Arun Chilukuri
Updated on: 11 May 2023 4:46 PM IST
Poonam Kaur Sensational Tweet on Pawan Kalyan Ustad Bhagat Singh Movie
X

మళ్లీ ఎంట్రీ ఇచ్చిన పూనమ్.. ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ పై సన్సేషనల్ ట్వీట్..

Poonam Kaur: పూనమ్ కౌర్..పరిచయం అక్కర్లేని పేరు ఇది. నటిగా అంతగా పాపులర్ కాలేదు కానీ...పవన్ కల్యాణ్ ఇష్యూస్ తో పూనమ్ చాలా పాపులారిటీ సంపాదించింది. తాజాగా మరోసారి పవన్ చిత్రంపై ట్వీట్ చేసి సోషల్ మీడియాలో పూనమ్ ట్రెండ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ టీమ్ తాజాగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ పై అభ్యంతరం చెబుతూ పూనమ్ ట్వీట్ చేసింది. స్వాతంత్ర్య సమరయోధులను మీరు గౌరవించలేకపోతే పోయారు కానీ కనీసం వారిని మాత్రం అవమానించకండని పూనమ్ ట్వీట్ చేసింది.

పవన్ సినిమా పోస్టర్ లో భగత్ సింగ్ పేరును పాదాల కింద ఉంచి అవమానించారని ఇది అహంకారమా..అజ్ఞానమా అని పూనమ్ ప్రశ్నించింది. పూనమ్ కౌర్ మరో ట్వీట్ కూడా చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ స్వాతంత్ర్య సమరయోధుడిని కచ్చితంగా అవమానించడమే..భగత్ సింగ్ యూనియన్ కు రిపోర్ట్ చేయండని పూనమ్ పేర్కొంది.

పూనమ్ తాజా ట్వీట్ పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మండిపడ్డుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో సైతం పూనమ్ కౌర్ పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసింది. కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకుంటూ, మనుషులను మారుస్తూ, మాట మీద ఉండకపోవడం, అమ్మాయిలను అడ్డంపెట్టుకొని, జనాల ఇన్నోసెన్స్ తో కొంతమంది ఆడుకుంటున్నారని ఫేస్ బుక్ లో పూనమ్ గతంలో ఒక పోస్ట్ పెట్టింది. అనంతరం ట్విట్టర్ లో జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త అతడో నమ్మక ద్రోహి అంటూ ట్వీట్ చేసింది. ఇక ఫిలిమ్ క్రిటిక్ మహేష్-పవన్ వివాదం సమయంలో కూడా పూనమ్ ఎంటర్ కావడం పెను సంచలనంగా మారింది.

పవన్ కల్యాణ్ మైలేజ్ ని డ్యామేజ్ చేసేందుకే పూనమ్ కౌర్ ను రంగంలోకి దింపారని అప్పట్లో పెద్ద చర్చ మొదలైంది. జనంలో పవన్ ఫోకస్ అవ్వడంతోనే పూనమ్ తో సోషల్ మీడియాలో ఎటాక్ చేయిస్తున్నారని ఫ్యాన్స్ ప్రధానంగా ఆరోపించారు. కట్ చేస్తే పవన్ మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా వెళుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ పర్యటన జరిగిన మరుసటి రోజే..పవన్ చిత్రాన్ని టార్గెట్ చేస్తూ పూనమ్ ట్వీట్ చేసింది. ఇదంతా రాజకీయ కక్షతోనే జరుగుతోందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.






Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story