Radhe Shyam Movie Update: సెట్స్ పైకి 'రాధేశ్యామ్‌'

Radhe Shyam Movie Update: ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌' సినిమా తిరిగి సెట్స్‌ పైకి వెళ్లింది.

Kranthi
Updated on: 26 Jun 2021 12:47 PM IST
Pooja Hegde joins the sets of Radhe Shyam in Unlock 2.0
X

 Radhe Shyam Movie Up Date: (File Images) 

Radhe Shyam Movie Update: కరోనా ప్రభావంతో వాయిదా పడ్డ సినిమాలు ఇపుడిపుడే సెట్స్ పైకి వెళుతున్నాయి. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌' సినిమా తిరిగి సెట్స్‌ పైకి వెళ్లింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. యూవీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే నాయిక. 70ల కాలం నాటి యూరప్‌ నేపథ్యంగా సాగే విభిన్నమైన ప్రేమకథతో రూపొందుతోంది.

కరోనా పరిస్థితులతో తుది దశ చిత్రీకరణలో నిలిచిన ఈ చిత్రం.. ఆఖరి షెడ్యూల్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో మొదలైంది. దాదాపు పదిరోజులకు పైగా ఈ షెడ్యూల్‌ కొనసాగనుందని సమాచారం. ఇందులో భాగంగా ప్రభాస్‌, పూజాలపై ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ షూట్‌ కోసం పూజా ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకుంది. ఈ చిత్రీకరణ పూర్తి కాగానే ప్రభాస్‌ 'సలార్‌', 'ఆదిపురుష్‌' సినిమాలతో బిజీ కానున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు వచ్చే నెల నుంచి పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం.

Kranthi

Kranthi

Next Story