చైతూ సినిమాలో రష్మిక స్థానంలో పూజా హెగ్డే?

చైతూ సినిమాలో రష్మిక స్థానంలో పూజా హెగ్డే?
x
Naga chaitanya with puja and rashmika
Highlights

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కోసం పోటీపడుతున్న హీరోయిన్లు ఇద్దరున్నారు. వారే పూజాహెగ్డే.. రాష్మిక మందాన. వీరిద్దరూ సంక్రాంతి సినిమాల్లో సందడి...

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కోసం పోటీపడుతున్న హీరోయిన్లు ఇద్దరున్నారు. వారే పూజాహెగ్డే.. రాష్మిక మందాన. వీరిద్దరూ సంక్రాంతి సినిమాల్లో సందడి చేసి హిట్ లు మూట కట్టుకున్నారు. ఇక వరుసగా ఆఫర్ల వెల్లువతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు ఇద్దరి చేతిలో పెద్ద ప్రాజెక్టులున్నాయి.

ఇక..14 రీల్స్ బ్యానర్లో నాగ చైతన్య హీరోగా పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా తెరకేక్కబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను ముందుగా అనుకున్నారు. ఈ మేరకు చాలా ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు రాష్మిక స్థానంలో పూజా హెగ్డే రానుందని టాలీవుడ్ సమాచారం.

ఈ సినిమా దర్శకుడు రాష్మిక మందాన హీరోయిన్ గా కావాలని కోరుకున్నారు. అయితే, నిర్మాతలు మాత్రం పూజాహేగ్డే అయితేనే బావుంటుందని భావిస్తున్నారట. దీంతో పూజా ను హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. గద్దలకొండ గణేష్ సినిమా సమయంలోనే పూజాహేగ్డే కు తరువాతి సినిమా కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారని టాక్. అందుకోసమే ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్మాతలు దర్శకుడు పరశురాం కు సూచిస్తున్నారట. దాదాపుగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా చేయడం ఖాయం అయిపోయిందని చెప్పుకుంటున్నారు.

ఇకపోతే, నాగచైతన్య గతంలో పూజాహేగ్దే తో కలసి ఒక లైలా కోసం సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా పోలేదు. అదేవిధంగా దర్శకుడు పరశురాం రాష్మిక మందానతో గీతాగోవిందం సినిమాకి కలిసి పనిచేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పరశురాం రాష్మిక చైతూ పక్కన చేస్తే బావుంటుందని భావించారట. ఇప్పుడు నిర్మాతల కోరిక ప్రకారం పూజా హెగ్డే తో ముందుకు వెళ్లాలని దర్శకుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సో రాష్మిక స్థానంలో పూజా నాగ చైతన్యతో జత కట్టబోతోందన్న మాట. అధికారికంగా ఈ సమాచారం త్వరలోనే వెల్లడిస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories