Hyderabad: నటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసుల పురోగతి

*నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు *చౌరాసియాపై దాడి చేసిన వ్యక్తి బాబుగా గుర్తింపు

Shilpa
Published on: 20 Nov 2021 11:10 AM IST
Police Arrested Accused Babu in Actress Chourasia Attack Case
X

నటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసుల పురోగతి(ఫైల్ ఫోటో)

Hyderabad: నటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వారం రోజుల అన్వేషణ తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చౌరాసియాపై దాడి చేసిన వ్యక్తి బాబుగా గుర్తించారు.

హైదరాబాద్ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న బాబు సినిమాల్లో లైట్‌మెన్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నటి చౌరాసియాపై దాడి చేసి ఆమె సెల్‌ ఫోన్‌ లాక్కెళ్లాడు. కేబీఆర్ పార్క్ సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో గుర్తింపు ఆలస్యమైనట్లు సమాచారం. బాబు గత నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Shilpa

Shilpa

Next Story