Kannada Hero Dhruva Sarja tests covid positive: కన్నడ హీరో ధృవ సర్జాకు కరోనా పాజిటివ్!

Kannada Hero Dhruva Sarja tests covid positive: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Krishna
Updated on: 15 July 2020 5:04 PM IST
Kannada Hero Dhruva Sarja tests covid positive: కన్నడ హీరో ధృవ సర్జాకు కరోనా పాజిటివ్!
X
Dhruva Sarja (File Photo)

Kannada Hero Dhruva Sarja tests covid positive: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.. ఇక కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీని కూడా వదలడం లేదు.. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ న‌టులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటుడు ధ్రువ సర్జా కరోనావైరస్ బారినా పడ్డారు.

తాజాగా ధ్రువ సర్జాకి కరోనా లక్షణాలు కనిపించడంతో అయన టెస్టులు నిర్వహించుకున్నారు. ఈ రిపోర్ట్ లో ఆయనకి కరోనా పాజిటివ్ అని నిర్ధరాణ అయింది. దీంతో ఆయన డాక్టర్ల సలహాతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ధ్రువ సర్జా ఎవరో కాదు.. యాక్షన్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు, అంతేకాకుండా ఒక నెల క్రితం గుండెపోటు కారణంగా మరణించిన చిరంజీవి సర్జాకి స్వయానా తమ్ముడు.

ధృవ సర్జాకు కరోనా పాజిటివ్ సోకడంతో అక్కడి పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ ప్రముఖులు కోరుకుంటున్నారు.. ప్రస్తుతం అతని ఇంటిని బిబిఎంపి అధికారులు మూసివేశారు. సర్జా దంపతులు ఇటీవలి రోజుల్లో తమతో పరిచయం ఉన్న వారందరినీ కరోనా పరీక్షించుకోవాలని సూచించారు.

అటు దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 29,429 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 9,36,181 కి చేరుకుంది. ఇక గడిచిన24 గంటల్లో 582 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 24,309 కి చేరుకుంది. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,19, 840 కాగా, 5,90,032 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.



Krishna

Krishna

Next Story