Thalaivi: "తలైవి"ప్రమోషన్స్ కు బ్రేక్?

Thalaivi: తలైవి ప్రమోషన్స్ పై కోర్టులో కేసు నమోదైంది.

Kranthi
Published on: 28 March 2021 1:14 PM IST
Break for Talaivi Promotions?
X

"తలైవి":(ఫోటో ది హన్స్ ఇండియా)

Thalaivi: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రధానపాత్రలో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తాజా చిత్రం 'తలైవి'. పాన్ ఇండియన్ మూవీగా 'తలైవి' చిత్రం రూపొందుతుంది. మంగళవారం (మార్చి23)న జయలలిత జయంతి సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మంచి టాక్ సంపాదించుకున్న 'తలైవి' మేకర్స్‌కి షాక్ తగినట్టు వార్తలు వస్తున్నాయి. అమ్మ బయోపిక్ 'తలైవి' సినిమా ప్రమోషన్స్ ఆపాలంటూ కోర్టులో పెటిషన్ వేయడం సర్వాత్రా ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. అతి కొద్దిరోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో 'తలైవి' ట్రైలర్ చర్చనీయాంశంగా మారిందని టాక్.

ఈ కారణంగా 'తలైవి' సినిమాకి నిర్వహించాలనుకుంటున్న ప్రమోషన్స్‌ని ఆపాలని ప్రముఖ న్యాయవాది ఒకరు భారత ఎన్నికల కమిషన్‌కి పిటిషన్‌లో నివేదించారని తెలుస్తోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు ఏదైనా ప్రచార సామగ్రిని ప్రదర్శించకూడదని.. అందుకే ఆపాలని పిటిషన్‌లో వెల్లడించినట్టు సమాచారం. అంతేకాదు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా అప్‌లోడ్ చేసిన ప్రచార మెటీరియల్‌ని వీలైనంత త్వరగా తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు దర్శక, నిర్మాతలను.. ప్రమోటర్స్‌ని ఆదేశించాలని న్యాయవాది కోరినట్లు సమాచారం అందుతోంది.

Kranthi

Kranthi

Next Story