Bangarraju Movie: బంగార్రాజులో పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్?

Bangarraju Movie: బంగార్రాజు సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ, కొవిడ్ కారణంగా ఇంతవరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు.

Venkata Chari
Published on: 22 May 2021 5:00 PM IST
Payal Rajput item Song in Nagarjuna New Movie Bangarraju
X

పాయల్ రాజ్‌పుత్ (ఫొటో ట్విట్టర్)

Bangarraju Movie: బంగార్రాజు సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. కానీ, కొవిడ్ కారణంగా ఇంతవరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ గా రానున్న ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల నాగార్జున ప్రధాన పాత్రతో వచ్చిన వైల్డ్ డాగ్ సినిమా భాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోవడంతో.. బంగార్రాజు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని నాగ్ ప్లాన్ చేస్తున్నాడు.

వెంకీ మామాలో వెంకటేష్‌తో నటించిన పాయల్ రాజ్‌పుత్.. ఈ సినిమాలో నాగార్జునతో నటించే అవకాశం ఉందంట. ఈ వార్తలు నిజమైతే.. పాయల్ ఈ చిత్రంలో ఒక ఐటమ్ సాంగ్ చేయనున్నారు. అనూప్ రుబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం మాస్ సాంగ్‌ను కంపోజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ పాటను మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేశారంట. ఈ సాంగ్ కోసం పాయల్‌ను సంప్రదించారంట. అయితే, ఇంత వరకు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Venkata Chari

Venkata Chari

Next Story