Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ కోసం మరో యంగ్‌ డైరెక్టర్‌..

Sudheer Varma: నిఖిల్ డైరెక్టర్ తో సినిమా సైన్ చేయబోతున్న పవన్ కళ్యాణ్?

Dhatripriya
Updated on: 20 March 2023 8:31 PM IST
Pawan Kalyan Planning Film With Young Director
X

మరొక యువ డైరెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్

Sudheer Varma: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" సినిమాతో వేణు శ్రీరామ్ కి, "భీమ్లా నాయక్" సినిమాతో సాగర్ కె చంద్రకి డైరెక్టర్లుగా మారే అవకాశాన్ని ఇచ్చారు. తాజాగా ఇప్పుడు మరొక యువ డైరెక్టర్ కి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనే సుదీర్ వర్మ. నిఖిల్ హీరోగా నటించిన "స్వామి రారా" సినిమాతో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న సుధీర్ వర్మ ఆ తర్వాత నాగచైతన్య హీరోగా "దోచేయ్" అనే సినిమాకి దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా అల్లరించలేక పోయింది. ఆ సినిమా తర్వాత విడుదలైన "కేశవ" కూడా అంతంతమాత్రంగానే నిలిచింది.

మాస్ మహారాజా రవితేజ తో "రావణాసుర" అనే ఒక హై వోల్టేజ్ యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా సుధీర్ వర్మ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధీర్ వర్మ దీని గురించి క్లారిటీ ఇచ్చారు.

త్రివిక్రమ్ ఒక స్టోరీ లైన్ చెప్పి ఇది పవన్ కళ్యాణ్ కి బాగుంటుందని కథని రెడీ చేయమని చెప్పారట. ప్రస్తుతం తాను ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ విషయంలోనే బిజీగా ఉన్నాను అని అంటున్నారు సుధీర్ వర్మ. అయితే ఈ సినిమా ఓకే అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి సుధీర్ వర్మ త్రివిక్రమ్ చెప్పిన లైన్ ఆధారంగా ఒక కథని రెడీ చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story