Pawan Kalyan OG: పవన్ OGలో బాలీవుడ్ బ్యూటీ..బాబోయ్ వద్దంటున్న ఫ్యాన్స్

OGలో ఐటమ్ సాంగ్ అనగానే పవన్ ఫ్యాన్స్ కలవరానికి గురవుతున్నారు. అయితే వీరు ఐటమ్ సాంగ్ ని వ్యతిరేకించడం లేదు కానీ..ఆ ఐటమ్ నంబర్ లో బాలీవుడ్ బ్యూటీ కనిపిస్తుందని తెలియడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి, జాక్వెలిన్ ను పవర్ స్టార్ ఫ్యాన్స్ రిజక్ట్ చేయడానికి కారణం ఏంటంటే..

Dhatripriya
Updated on: 1 Jun 2023 7:01 AM IST
Pawan Kalyan OG: పవన్ OGలో బాలీవుడ్ బ్యూటీ..బాబోయ్ వద్దంటున్న ఫ్యాన్స్
X

Pawan Kalyan OG: పవన్ OGలో బాలీవుడ్ బ్యూటీ..బాబోయ్ వద్దంటున్న ఫ్యాన్స్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే బ్రో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో చేసిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుండగా హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ నేతృత్వంలో OG, క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు చిత్రాలో పవన్ నటిస్తున్నారు. వీటిలో హరిహరవీరమల్లు షూటింగ్ పై సస్పెన్స్ కొనసాగుతుండగా ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పవన్ ఫోకస్ అంతా OG పైనే ఎక్కువగా ఉంది. ఈ మూవీ షూటింగ్ కే పవన్ ఎక్కువ డేట్స్ కేటాయించారు కూడా.

OG మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా పవన్ లేకుండానే మూడో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అతి త్వరలోనే నాల్గవ షెడ్యూల్ ప్రారంభం కానుండగా ఇందులో పవన్ జాయిన్ కానున్నారు. ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబంధించి ఒక అప్ డేట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తోంది. విషయం ఏంటంటే ఈ మూవీకి పాన్ ఇండియా టచ్ ఇచ్చేందుకు దర్శకుడు సుజిత్ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో ఐటమ్ సాంగ్ చేయించే ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ తెగ మధనపడిపోతున్నారు.

ఐటమ్ సాంగ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాట ఏ రేంజ్ లో హిట్టయిందో మనకు తెలిసిందే. అలాంటిది OGలో ఐటమ్ సాంగ్ అనగానే పవన్ ఫ్యాన్స్ కలవరానికి గురికావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే వీరు ఐటమ్ సాంగ్ ని వ్యతిరేకించడం లేదు కానీ..ఆ ఐటమ్ నంబర్ ను బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ తో చిత్రీకరించడంపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏంటంటే, సుజిత్ తన చిత్రమైన సాహోలో కూడా జాక్వెలిన్ ఐటమ్ నంబర్ లో మెరిసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో సెంటిమెంట్ గా జాక్వెలిన్ ని వద్దని సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అభ్యర్థిస్తున్నారు.

మరి, ఫ్యాన్స్ డిమాండ్ కు పవన్ తలవంచుతాడా లేదంటే..ఎప్పటిలానే ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్ సెంటిమెంట్స్ కి విలువ ఇవ్వకుండా ముందుకు వెళతాడా అనేది చూడాలి. ఇకపోతే డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న OG మూవీ షూటింగ్ ని అక్టోబర్ కల్లా పూర్తి చేసి..ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story