Pawan Kalyan: పవన్ మంచి మనసు.. జనమే కాదు పోలీసులు ఫిదా..!

Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

Arun Chilukuri
Published on: 11 May 2023 1:16 PM IST
Pawan Kalyan Giving Energy Drink to Tired Police Officer
X

Pawan Kalyan: పవన్ మంచి మనసు.. జనమే కాదు పోలీసులు ఫిదా..!

Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదల కోసం పోరాటం చేస్తూ వారికి పలుమార్లు ఆర్థిక సాయం అందించారు. అందుకే పవన్ పేరు వింటే..సినిమాలే కాదు ఆయన సేవా కార్యక్రమాలు గుర్తుకొస్తాయి. పదేళ్ల కాలంగా పేదల తరపున పోరాటం చేస్తున్న జనసేనాని తాజాగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించారు.

పవన్ పర్యటన నేపథ్యంలో జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మండుటెండలో తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా కదిలివచ్చారు. పవన్ పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. అయితే మండే ఎండలో విధులు నిర్వహించడం అంటే ఎంత కష్టమో మనకు తెలిసిందే కదా..పవన్ పర్యటనలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎండ వేడిమి తట్టుకోలేక చెమటలు కక్కారు.

పవన్ పర్యటనలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పి.గన్నవరం సీఐ ప్రశాంత్ కుమార్ చెమటలు కక్కుతూ చాలా అలసటగా కనిపించారు. ఇది గమనించిన పవన్ కల్యాణ్ వెంటనే ఆ సీఐకు తన వద్ద ఉన్న ఎనర్జీ డ్రింక్ ను అందించారు. అది తాగిన తర్వాత సీఐ చాలా రిలాక్డ్స్ గా కనిపించారు. పవన్ కల్యాణ్ పోలీస్ అధికారికి ఎనర్జీ డ్రింక్ అందిస్తున్న దృశ్యాలను, సదరు అధికారి సేవిస్తున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న జనసేన అభిమానులు తమ మొబైల్స్ లో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇది పవన్ మంచి మనసుకు మరో ఉదాహరణ అంటూ జనసేన అభిమానులు కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story