Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు గట్టిపోటీ.. రంగంలోకి ఇద్దరు టాప్ హీరోలు..!

Hari Hara Veera Mallu: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడంతో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ లేట్ అవుతున్న విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Nov 2024 3:39 PM IST
Pawan Kalyan Faces Tough Competition Two Top Heroes Enter the Field
X

Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు గట్టిపోటీ.. రంగంలోకి ఇద్దరు టాప్ హీరోలు..!

Hari Hara Veera Mallu: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవడంతో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ లేట్ అవుతున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా పవన్ బిజీగా ఉన్నా.. కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసే పనిలో పడ్డారు. ముందుగా వీరమల్లు షూటింగ్ పూర్తిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్.. ఇప్పుడు చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. 2025 మార్చి 28న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది పవన్ కల్యాణ్‌కు గట్టిపోటీ తప్పేలా లేదు.

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతోన్న ‘VD 12’ చిత్రంను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కావడంతో.. VD 12ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయినా కూడా పవన్‌ను ఢీకొట్టేందుకు ఇద్దరు టాప్ హీరోస్ రంగంలోకి దిగుతున్నారు. మలయాళం అగ్ర హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతోన్న లూసిఫర్ సీక్వెల్ ‘L2:ఎంపురన్’ మార్చి 27న రిలీజ్ కాబోతోంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సికందర్’ కూడా మార్చి 28నే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

లూసిఫర్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీక్వెల్ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్‌కు టాలీవుడ్‌లో కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ రెండు సినిమాలు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి గట్టి పోటీ ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పాలి. వీరమల్లుకి పోటీగా లూసిఫర్, సికందర్ రిలీజ్ అయితే.. కచ్చితంగా పవన్ కలెక్షన్స్‌పై ఇంపాక్ట్ ఉంటుంది. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా వీరమల్లు కావడం ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

దర్శకుడు క్రిష్ హరిహర వీరమల్లు చిత్రంను స్టార్ట్ చేశారు. షూటింగ్ డిలే కారణంగా (పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో) మధ్యలోనే ఆయన తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. చిత్రీకరణ ఇప్పుడు చివరిదశలో ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల 'నిధి' అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్‌, నాజర్, రఘుబాబు, సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్పలు నటిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story