Pawan Kalyan: పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో పవన్ కళ్యాణ్ సినిమా

Pawan Kalyan: పొలిటికల్ థ్రిల్లర్ గా "భవదీయుడు భగత్ సింగ్"

admin1
Updated on: 1 Nov 2021 5:46 PM IST
Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh Movie Comming With Political Backdrop
X

భవదీయుడు భగత్ సింగ్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాని తెలుగులో "భీమ్లా నాయక్" గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" తో కూడా బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. "గబ్బర్ సింగ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. అయితే తాజాగా ఈ సినిమా ఉండబోతోంది అనే విషయం పై వచ్చిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటికే ఈ సినిమా కి "భవదీయుడు భగత్ సింగ్" అనే టైటిల్ ని ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. "కెమెరామెన్ గంగతో రాంబాబు" సినిమాని 2012లోనే చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో ఈ సినిమా చాలా వివాదాలకు దారితీసింది. చాలా కాలం తర్వాత మళ్లీ ఒక పొలిటికల్ సినిమాలో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఉన్న రాజకీయ అవగాహన మరియు అనుభవం మీద ఈ సినిమా కథ నడవబోతుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story