త్వరలో తెలుగు తెరపైకి పవన్ కళ్యాణ్ వారసుడు?

K V D Varma
Updated on: 7 Oct 2019 12:51 PM IST
త్వరలో తెలుగు తెరపైకి పవన్ కళ్యాణ్ వారసుడు?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో జనసేనానిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా సినిమాల్లోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆ సినిమా మరాఠీ సినిమా. ఈ సినిమా అక్కడ విజయవంతం అయింది. దీంతో ఆ సినిమాని తెలుగులోకి అనువదించాలని ముందు భావించారు. కానీ, తన కొడుకు మొదటి సినిమా తెలుగులో నేరుగా ఉంటేనే బావుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే ఆ సినిమా డబ్బింగ్ ఆపేశారని సమాచారం.

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం అకీరా త్వరలోనే తెలుగు సినిమాలో నటించనున్నారు. ఆయనను టాలీవుడ్ లో లాంచ్ చేసే బాధ్యతను రామ్ చరణ్ తీసుకున్నారని వినిపిస్తోంది. ఇటీవలే సైరా తో విజయం సాధించిన రామ్ చరణ్ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పడు తానూ అమితంగా ప్రేమించే బాబాయ్ పవన్ కుమారుడ్ని పరిచయం చేస్తూ సినిమా నిర్మించాలని అయన భావిస్తున్నట్టు టాలీవుడ్ టాక్. పూర్తీ సమాచారం త్వరలోనే రామ్ చరణ్ వెల్లడిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి.


K V D Varma

K V D Varma

Next Story