Sonu Sood Promises To Help a woman : ఆ సోదరికి సోనూసూద్ రాఖీ గిఫ్ట్!

Sonu Sood Promises To Help a woman : సోనూసూద్ .. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎవరి మాట విన్న ఇదే పేరు.. కష్టం, సహాయం అనే మాట వినిపిస్తే చాలు

Krishna
Updated on: 4 Aug 2020 4:43 PM IST
Sonu Sood Promises To Help a woman : ఆ సోదరికి సోనూసూద్ రాఖీ గిఫ్ట్!
X
sonusood(File photo)

Sonu Sood Promises To Help a woman : సోనూసూద్ .. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎవరి మాట విన్న ఇదే పేరు.. కష్టం, సహాయం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు.. కరోనా సమయంలో చాలా మంది వలస కూలీలను వారివారి సొంత గ్రామాలకు చేర్చిన సోనుసూద్ వారి పాలిట దేవుడు అయ్యాడు. సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో అందరి దృష్టిలో హీరో అనిపించుకుంటున్నాడు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కానీ ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం మాత్రం కొందరికి మాత్రమే ఉంటుందని చూపించాడు సోనుసూద్..

కష్టం అనే మాట వింటే చలించిపోయే సోనూసూద్ తాజాగా మరొకరికి కష్టం వస్తే తీరుస్తానని మాట ఇచ్చాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని జ‌ల్‌పైగురిలో వ‌ర‌ద‌ల కార‌ణంగా ఓ మ‌హిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంస‌మైంది అయితే తిరిగి నిర్మించుకోవడానికి కూడా ఆమెకి సహాయంగా భర్త కూడా లేడు. ఇక ఆమె పిల్లలు తిన‌డానికి కూడా తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. పూర్తిగా ధ్వంస‌మైన వీడియోని సోనాల్ సింఘ్ అనే మ‌హిళ ట్విట్టర్ లో పోస్ట్ చేసి సోనూసూద్ కి ట్యాగ్ చేసింది.

ఇది చూసి చలించిపోయిన సోనూసూద్ ఆమెకు రాఖీ పండుగ‌రోజును ఆ చెల్లెమ్మకి ఓ కొత్త ఇంటిని కానుకగా ఇస్తానని హామీ ఇచ్చాడు. "రక్షా బంధన్ సందర్భంగా మా సోదరికి సహాయం చేద్దాం. ఆమె కోసం కొత్త ఇల్లు కట్టుకుందాం" అని సోను సూద్ ట్వీట్ చేశారు. దీంతో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో సోనూసూద్ పేరు మారుమ్రోగుతుంది. హాట్స్ ఆఫ్ సోనూసూద్ అని అంటూ పలువురు సోనుసూద్ ని ప్రశంసిస్తున్నారు.


Krishna

Krishna

Next Story