ఫ్రీగా నటిస్తా అంటున్న నూతన్ నాయుడు

బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ను పాపులర్ అయ్యాడు కామన్ మాన్ నూతన్ నాయుడు. ఇక షో తరువాత ఇప్పుడు అతని కాన్సన్ట్రేషన్ సినిమాల పైకి మరల్చాడు.

Ruthvik
Published on: 8 Jan 2019 1:27 PM IST
Nutan Naidu
X
Nutan Naidu

బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ను పాపులర్ అయ్యాడు కామన్ మాన్ నూతన్ నాయుడు. ఇక షో తరువాత ఇప్పుడు అతని కాన్సన్ట్రేషన్ సినిమాల పైకి మరల్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన 'ఎఫ్ 2' సినిమాలో నూతన్ నాయుడు నటించాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పక్కనపెడితే ఇప్పటికే తెలుగులో 14 పెద్ద సినిమాలు 3 మెగా సీరియల్స్ కు సైన్ చేశాడు నూతన్. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే బిగ్ బాస్ 2 షో లో రెమ్యూనరేషన్ ఏమీ తీసుకోలేదు అని పలు సందర్భాల్లో చెప్పిన నూతన్ నాయుడు సినిమాల్లో కూడా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట.

వరుసగా 14 సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్కరి దగ్గర కూడా రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదట. పై పెచ్చు అసిస్టెంట్ ఫీజు, ట్రావెలింగ్ చార్జీలు మరియు లాడ్జింగ్ చార్జీలకు కూడా తానే డబ్బులు పెట్టుకుని మరీ షూటింగ్ కి వెళ్తున్నాడట. నటన అంటే తనకు చాలా ఇష్టమని తనకున్న ప్యాషన్ వేరే వాళ్లకు భారం కాకూడదనే ఉద్దేశంతో నాయుడు ఇలా ఫ్రీ గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. ఇకపై కూడా అలానే పని చేస్తానని అంటున్నాడు నూతన్. ఇక నూతన్ కోసం ఇప్పుడు స్టార్ దర్శకులు మరియు ప్రొడ్యూసర్లు డేట్ల కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Ruthvik

Ruthvik

Next Story