Bobbili Puli Movie completed 38 years: 'బొబ్బిలి పులి' చిత్రానికి 38 ఏళ్లు..

Bobbili Puli Movie completed 38 years: బొబ్బిలి పులి చిత్రానికి 38 ఏళ్లు..
x
Highlights

Bobbili Puli Movie completed 38 years: ఎన్టీఆర్ అంటేనే డైలాగ్స్.. పేజీ డైలాగ్స్ అయిన సరే అయన ఎక్కడకూడా తడబడకుండా చెబుతారు.

Bobbili Puli Movie completed 38 years: ఎన్టీఆర్ అంటేనే డైలాగ్స్.. పేజీ డైలాగ్స్ అయిన సరే అయన ఎక్కడకూడా తడబడకుండా చెబుతారు. అలాంటి ఆయనకి మాటల తూటాలు పేల్చే దాసరి లాంటి దర్శకుడు, రచయిత దొరికితే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి.. అవును.. ఎలా ఉంటుందో బొబ్బిలిపులి సినిమా చూపించింది. ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికతో వచ్చిన ఐదో చిత్రం ఇది.. ఈ సినిమాని 1982 జూలై 9న విడుదల చేయగా అన్ని సెంటర్లలో సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా చెరిపేసి కొత్త రికార్డు సృష్టించింది. నేటితో ఈ సినిమాకి 38 ఏళ్లు నిండాయి. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

* ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో మొత్తంగా 5 చిత్రాలు తెరకెక్కాయి. మొదటి చిత్రం మనుషులంతా ఒక్కటే కాగా చివరి చిత్రం బొబ్బిలిపులి..

* ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా శ్రీదేవి నటించింది. లాయర్ విజయగా శ్రీదేవి నటన అద్భుతం.. ఈ సినిమా తరవాత ఆమె నటన స్థాయి మరింత ఎత్తుకు చేరుకుంది. ఎన్టీఆర్ తో సమానంగా ఆమె నటన ఉంటుంది.

* ఈ సినిమాని హీరో వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ నిర్మించారు.

* జేవి రాఘవులు ఈ సినిమాకి సంగీతం అందించగా, ప్రతి పాట సూపర్ డూపర్ హిట్టే.. ముఖ్యంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ పాట నేటికి ఎవర్ గ్రీన్ .. ఈ పాటను దాసరి నారాయణ రావు రాయగా ఎస్పీ బాలు ఆలపించారు.

*ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన సమయానికి దాసరి తెరకెక్కించిన చిత్రాలు ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితంలో కీ రోల్ పోషించాయి. ముఖ్యంగా అయన రాజకీయ ప్రచారంలో ఉండగా ఈ సినిమా విడుదల అవ్వడం ఎన్టీఆర్ కి బాగా ప్లస్ అయింది. ఆ తరవాత ఎన్టీఆర్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు.

* ఈ సినిమా మొత్తం 39 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచింది.

* ఇక సినిమా కోర్టులో వచ్చే సన్నివేశం సినిమాకి బిగ్గెస్ట్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. వీటిని ఏకంగా క్యాసేట్లుగా అమ్మేవారు. ప్రేక్షకులు కూడా అవి విరగబడి కొనేవారు.

* ఈ సినిమాకి వేటూరి సుందరరామమూర్తితో కలిసి దాసరి నారాయణరావు కూడా పాటలు రాశారు.

* బొబ్బిలిపులి డ్రస్ అప్పుడో ఫ్యాషన్.. చిన్నపిల్లల కూడా ప్రత్యేకంగా ఆ డ్రస్ ధరించేవారు.

* 2011 లో ఎన్.టి.రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ , దాసరి నారాయణరావు 150 వ చిత్రం పరమ వీర చక్ర చిత్రంలో నటించి ఈ చిత్రానికి నివాళి అర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories