ఎన్టీఅర్ సుభాష్ చంద్రబోస్.. అల్లు అర్జున్ మణికర్ణిక, సైరా!

ఇవి కొత్త సినిమాలు అనుకుంటున్నారా? కాదండీ.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మన స్టార్ ల పిల్లలు చేసిన సందడి.

K V D Varma
Updated on: 15 Aug 2019 6:38 PM IST
ఎన్టీఅర్ సుభాష్ చంద్రబోస్.. అల్లు అర్జున్ మణికర్ణిక, సైరా!
X

ఇవి కొత్త సినిమాలు అనుకుంటున్నారా? కాదండీ.. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మన స్టార్ ల పిల్లలు చేసిన సందడి. దేశభక్తిని పిల్లల్లో పెంచడానికి వారికి దేశ నాయకుల వేషాలు వేయించడం సర్వసాధారణం. ఇది అందరి ఇళ్ళలో జరిగేదే. కానీ, మన సినీ స్టార్ లు కూడా తమ పిల్లల్లో దేశభక్తి పెంచడం కోసం వారితో ఇటువంటి మేకప్ వేయించారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన పెద్ద కుమారుడు అభయ్ రామ్ తో సుభాష్ చంద్రబోస్ గెటప్ వేయించారు. ఈ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పిల్ల్లలతో కూడా ఇదే విధంగా మేకప్ చేయించి ఇంస్టా లో పోస్ట్ చేశారు. బన్నీ కుమారుడు అల్లు అయాన్‌ సైరా నరసింహారెడ్డి(ఉయ్యాలవాడ నరసింహారెడ్డి) లుక్‌లో, కుమార్తె అర్హ మణికర్ణిక(రాణి లక్ష్మీబాయి) లుక్ లో కనిపించారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో క్యూట్ గా ఉన్న వీరి ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

#JaiHind

Jr NTR (@jrntr) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

My Babies ... Celebrating Freedom ... ❤️❤️

Allu Arjun (@alluarjunonline) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

My Babies ... Celebrating Freedom ... ❤️❤️

Allu Arjun (@alluarjunonline) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


K V D Varma

K V D Varma

Next Story