ఎన్టీఆర్ ను దేవుడు అనుకున్న ఇందిరాగాంధీ

ఎన్టీఆర్ ను దేవుడు అనుకున్న ఇందిరాగాంధీ
x
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. ఇక రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు'...

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయిన సంగతి తెలిసిందే. ఇక రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా ఫిబ్రవరి 22న విడుదల కానుంది. ప్రమోషన్ లో భాగంగా నిన్న ఈ సినిమా దర్శక నిర్మాతలు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా మొత్తం రాజకీయ జీవితం పైనే ఆధారితమై ఉంటుందని తెలిసిన విషయమే. ట్రైలర్ చూస్తే కూడా ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.

కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ ను చూసి ఇందిరాగాంధీ దేవుడు అనుకోవడం, రానా చెప్పే డైలాగులు, బాలయ్య చైతన్య రథం సీన్లు ట్రైలర్ లో హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా మొత్తం ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు మరియు నాదెండ్ల మధ్య పొలిటికల్ డ్రామాగా సాగుతుందని అర్థమవుతుంది. అలాగే బసవతారకం క్యాన్సర్ ట్రీట్మెంట్ సీన్లు ఎమోషనల్ గా ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు. మొదటి పార్ట్ ఎలా ఉన్నా 'ఎన్టీఆర్ మహానాయకుడు' ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories