మళ్లీ వాయిదా పడ్డ 'ఎన్టీఆర్ మహానాయకుడు'

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం గా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9, 2019 లో విడుదలైన సంగతి తెలిసిందే....
ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం గా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9, 2019 లో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ ప్రేక్షకులకు కనువిందు చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో ఆ ఎఫెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ లో రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' పైన బాగానే పడింది. మొదట ఫిబ్రవరి 7వ తారీఖు న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడింది.
దర్శకుడు క్రిష్ మరియు బాలయ్య ఈ సినిమా కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అందుకని ఈ సినిమా ఫిబ్రవరి 14వ తారీఖున విడుదల కావచ్చని వార్తలు వచ్చాయి. అయితే చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 28వ తారీఖున కానీ లేక మార్చి మొదటి వారంలో కానీ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
Wrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMTఉక్రెయిన్ కథ ముగిసిపోయిందంటున్న రష్యా.. పుతిన్ తర్వాతి టార్గెట్ ఆ...
27 May 2022 2:00 PM GMTKarimnagar: అక్రమ వడ్డీలకు యువకుడి బలి
27 May 2022 1:30 PM GMT'ఆది పురుష్' విషయంలో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులు
27 May 2022 1:00 PM GMTఎమ్మెల్యే కోటంరెడ్డికి తీవ్ర అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రికి...
27 May 2022 12:48 PM GMT