సారథి స్టూడియోస్ లో 'మహానాయకుడు'

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోపిక్ లో మొదటి భాగంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ఈమధ్యనే విడుదలైంది.

Ruthvik
Published on: 14 Jan 2019 1:09 PM IST
NTR Mahanayakudu
X
NTR Mahanayakudu

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన బయోపిక్ లో మొదటి భాగంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా ఈమధ్యనే విడుదలైంది. బాలకృష్ణ అచ్చు ఎన్టీఆర్ లాగానే కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అందరి కళ్ళూ బయోపిక్ లో ఆఖరి భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' పై మాత్రమే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో జరుగుతోంది. సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్న కొందరు నటీనటులు ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ను బాలయ్య ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. విద్యాబాలన్ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో కనిపించనుండగా, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు.

Ruthvik

Ruthvik

Next Story